Rohit Sharma : ధోనీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో ‘హిట్‌మ్యాన్’ సరికొత్త చరిత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్ ద్వారా ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఒక చెరిగిపోని రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఏడో ఓవర్‌లో సిక్సర్ కొట్టడం ద్వారా ఈ జట్టుపై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. గతంలో ఎంఎస్ ధోనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 50 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు రోహిత్ మాహీని అధిగమించి ఈ జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్‌పై 61 సిక్సర్లు, కేకేఆర్‌పై 54 సిక్సర్లతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాడు. అలాగే 48 సిక్సర్లతో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడానికి కేవలం అడుగు దూరంలో నిలిచాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మరో 11 పరుగులు (మొత్తం 46) చేసి ఉంటే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్‌లో 6,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. ప్రస్తుతం అతను ముంబై తరఫున ఆడిన 229 మ్యాచ్‌లలో 5,989 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ రాబోయే మ్యాచుల్లో ఈ మైలురాయిని అధిగమించడం ఖాయం. ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రోహిట్ ముంబై జట్టులో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నాడు.
READ ALSO: Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..