Peddi Release Date: ఆస్కార్ అవార్డు విజేత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ 59వ పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ టీమ్ స్పెషల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌ను సర్పైజ్ చేసింది. తాజాగా పెద్ది టీమ్ ఏఆర్ రెహమాన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆయన నుంచి మరో సింగిల్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఈ పోస్టర్‌లో పేర్కొంది. ఉప్పెన ఫేం బుచిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ ఓ పాన్ ఇండియా స్థాయిలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.
READ ALSO: Jana Nayagan: దళపతి ఆఖరి పోరాటం.. ఇంకా రాని సెన్సార్ సర్టిఫికేట్!
సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న, కనిపిస్తున్న పెద్ది రిలీజ్ వాయిదా అనే ప్రచారానికి చిత్ర బృందం తాజాగా పుల్‌స్టాప్ పెట్టింది. ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌లో పెద్ది టీమ్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ పోస్టర్ గమనిస్తే అందులో పెద్ది సినిమా ముందు నుంచి అనుకున్న టైంకే థియేటర్స్‌లోకి రాబోతుందని అర్థం అవుతుంది. మార్చి 27, 2026న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా పెద్ది గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని చిత్ర బృందం మరోసారి అఫిషియల్‌గా ప్రకటించింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో కనిపిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాయి.
Team #Peddi wishes the 'Isai Puyal' @arrahman sir a very Happy Birthday ❤🔥#Peddi's album will be one of the best in his illustrious career ✨🔥#ChikiriChikiri is just the beginning, wait for his magic in the next single 🤩
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/XMbludmSaE
— PEDDI (@PeddiMovieOffl) January 6, 2026
READ ALSO: Mukesh Ambani: రిలయన్స్‌కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ