Game Changer : రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ వేడుక అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతోంది. అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన తొలి భారతీయ సినిమాగా గేమ్ ఛేంజర్ కొత్త రికార్డు సృష్టించింది.
Read Also:Police Seized Liquor: బంగాళదుంపల బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం.. రూ.30 లక్షల మద్యం స్వాధీనం
Star Star 'Powerstar' @PawanKalyan slogans At Dallas Pre-release Event Of Global star @AlwaysRamCharan #Gamechanger 💥🔥♥️ pic.twitter.com/GIIvupKUPb
— Nizam PawanKalyan FC™ (@NizamPKFC) December 22, 2024
Read Also:Chiranjeevi : సర్దార్ డైరెక్టర్ కు మెగాస్టార్ ఛాన్స్.. ?
ఈ ఈవెంట్‌ను అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, అతిథి నటుడు సుకుమార్, బుచ్చిబాబు, యాంకర్ సుమ వీరితో పాటు అనేక మంది గేమ్ ఛేంజర్ నటులు ఇప్పటికే అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే. వారితో పాటు ఈవెంటు భారీగా జనసందోహం హాజరైంది. స్టేడియం మొత్తం తెలుగు వారితో నిండిపోయింది. ఈ క్రమంలో ఓ అనుహ్య ఘటన ఎదురైంది. ఈవెంట్ సమయంలో స్టేడియంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనియా కనిపించింది. తెలుగు వారంతా స్టార్ స్టార్ పవర్ స్టార్ అంటూ స్లోగన్స్ చేయడం ప్రారంభించారు.