Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమా కల్కి. జూన్ 27 , 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా విడుదలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీపికా పదుకునే, దిశా పటాని లాంటి బాలీవుడ్ అగ్ర కథనాయకిలు ఇందులో నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, యూనివర్సల్ స్టార్ హీరో కమలహాసన్ లు ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను తాజాగా సినీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది. మొత్తంగా ఈ ట్రైలర్ ను చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించే సంఘటనలు చాలానే ఉన్నాయి. తన క్రియేటివిటీతో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచంతో పాటుగా, యాక్షన్ ఎలిమెంట్స్, అదిరిపోయే విజువల్స్, ఎమోషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని కట్టి పడేసేలా ఉన్నాయి. రిలీజ్ ట్రైలర్ ను ఎంతో గ్రాండ్ గా విడుదల చేశారు. నిజం చెప్పాలంటే.. ఈ ట్రైలర్ అంచనాలకు మించి ఉందని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ తో సినిమా అంచనాలను మరింత పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ ను చూసేయండి.