Sister Sends Rakhi: దేశవ్యాప్తంగా ప్రజలందరూ రక్షాబంధన్ వేడుకను జరుపుకొంటుండగా.. ఓ సోదరి మాత్రం తన అన్న కోసం 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె గత 4 ఏళ్లుగా తన అన్న విడుదల కోసం తిరగని ప్రభుత్వ కార్యాలయాలం లేదు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన ప్రసన్నజిత్ రంగరీ అనే బి.ఫార్మసీ విద్యార్థి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా అతడి జాడ తెలియకపోవడంతో ఏదైనా ప్రమాదంలో మృతిచెంది ఉంటాడని కుటుంబం భావించింది. కానీ 2021 లో మహ్కేపార్‌లో నివసించే అతని సోదరి సంఘమిత్రకు ఊహించని ఒక ఫోన్ వచ్చింది. ఈ కాల్ కుల్దీప్ సింగ్ అనే వ్యక్తి చేసి.. ప్రసన్నజిత్ బతికి ఉన్నాడని, అది కూడా పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఖైదీగా ఉన్నాడని తెలిపాడు. నాటి నుంచి సంఘమిత్ర తన సోదరుడిని విడుదల చేయించడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు రక్షాబంధన్ సందర్భంగా, ఆమె తన సోదరుడికి ఒక లేఖ రాసింది.
READ MORE: Chiranjeevi: నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.. పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ!
అమ్మ నిన్ను చాలా మిస్ అవుతోంది.. సంఘమిత్ర లేఖ..
“సోదరా, రక్షాబంధన్ రోజున నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను నీకు రాఖీ పంపాలనుకుంటున్నాను, కానీ నువ్వు భారతదేశం నుంచి చాలా దూరంలో ఉన్నావు. నేను నీకు రాఖీ పంపాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం ప్రేమతో పంపిన రాఖీని స్వీకరించు. ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది, కానీ నేను నా సోదరుడికి రాఖీ కట్టలేకపోతున్నాను. అమ్మ నిన్ను చాలా మిస్ అవుతోంది, అలాగే నీ మేనకోడళ్ళు కూడా నిన్ను మిస్ అవుతున్నారు.. వాళ్లు నిన్ను చూడాలని కోరుకుంటున్నారు” అని లేఖలో పేర్కొంది.
ప్రసన్నజిత్ పాకిస్థాన్‌లోని కోట్ లఖ్‌పత్ సెంట్రల్ జైలులో దాదాపు 6 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతను ఇంటి నుండి వెళ్లిపోయి దాదాపు 14 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి సంఘమిత్ర తన సోదరుడికి రాఖీ కట్టలేదు. ఇప్పుడు సంఘమిత్ర లేఖ కూడా తన సోదరుడికి చేరలేదు. పహల్గాం ఉగ్రదాడి కారణంగా పోస్టల్ సేవలు నిలిచిపోవడంతో తాను రాసిన లేఖను తన సోదరుడికి పంపించలేకపోయినట్లు కంటతడి పెట్టింది. రక్షాబంధన్ సందర్భంగా తన సోదరుడికి రాఖీ పంపాలనుకుంటున్నానని.. భారత్ నుంచి ప్రేమతో పంపిన రాఖీని పాక్ అధికారులు లాహోర్లోని కోట్ లఖ్పత్ జైల్లో ఉన్న తన సోదరుడికి అందజేయాలని కోరింది. ఈక్రమంలో సంఘమిత్ర తన సోదరుడిని పాకిస్థాన్ జైలు నుంచి విడుదల చేసే వరకు తాను ఎవరికీ రాఖీ కట్టనని శపథం చేసింది.
కొద్దికాలం కిందట తమ తండ్రి చనిపోయాడని, తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె పేర్కొంది. ప్రసన్నజిత్‌ను గుర్తించడానికి మంత్రిత్వ శాఖ నుంచి పత్రాలు కోరినట్లు సంఘమిత్ర తెలిపారు. ఆ పత్రాలలో కొన్నింటిలో ప్రసన్నజిత్ పేరు ప్రస్తావించబడిందని పేర్కొన్నారు. అతను సునీల్ అడే పేరుతో పాకిస్థాన్ జైలులో ఉన్నట్లు ఆమె వెల్లడించింది. అక్టోబర్ 1, 2019న ప్రసన్నజిత్‌ను పాకిస్థాన్‌లోని బాటాపూర్‌లో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ స్పందించి తన సోదరుడిని పాక్ జైలు నుంచి విడించాలని ఆమె కోరింది.
READ MORE: Indian Railways: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఇలా చేస్తే 20 శాతం డిస్కాంట్..!