ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయో ‘రాజు వెడ్స్ రాంబాయి’ మరోసారి నిరూపించింది. యదార్థ గాథ ఆధారంగా దర్శకుడు సాయిలు కంపటి తెరకెక్కించిన ఈ చిత్రం, తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్రియుల కోసం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) లో నేటి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : Allu Arjun : అట్లీ మూవీలో.. పాపం మృణాల్‌కి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారేంటీ..!
ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ దీని టెక్నికల్ టీమ్. ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల స్వయంగా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడంతో సినిమాపై ముందు నుంచే పాజిటివ్ బజ్ నెలకొంది. సురేష్ బొబ్బిలి అందించిన మట్టి వాసనతో కూడిన సంగీతం మరియు పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ అన్నయ్య చైతు జొన్నలగడ్డ ఈ సినిమాలో విలన్‌గా నటించి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన పోషించిన పాత్ర సినిమాలోని ఎమోషన్‌ను మరింత పీక్స్‌కు తీసుకెళ్లిందని చెప్పాలి.
కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, సామాజిక అంశాలను కూడా టచ్ చేస్తూ సాగే ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గదిగా నిలిచింది. అప్పట్లో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, అలాగే మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడే ‘ఆహా’ యాప్‌లో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతున్న వారికి ఈ చిత్రం ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనడంలో సందేహం లేదు.