టాలీవుడ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తాజా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. విలేజ్ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చాయి. అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషించగా. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించగా, ప్రత్యేక అతిథిగా హీరో కిరణ్ అబ్బవరం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కిరణ్ అబ్బవరం, సినిమా క్లైమాక్స్ గురించి చేసిన కామెంట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. “నేను జీవితంలో ఎన్నో దారుణాలు, ఎన్నో నిజాలు విన్నాను. కానీ ఈ సినిమా టీమ్ నా దగ్గరకు వచ్చి క్లైమాక్స్ చెప్పినప్పుడు నిజంగా షాక్ అయ్యాను. ఇలాంటి సంఘటనలు నిజంగానే జరిగాయా? అనిపించింది,” అని ఆయన చెప్పారు.
Also Read : Mahesh-Babu : హాలీవుడ్ ఆడియెన్స్‌ని షేక్ చేస్తున్న మహేష్ బాబు – ‘వారణాసి’ లుక్‌పై అంతర్జాతీయ స్పందన!
అంతేకాదు, ఇలాంటి ఘటనలు జరిగిన ఊరి వాళ్లు ఎదుర్కొనే బాధను కూడా ఆయన వివరించారు. “ఒక దారుణం తమ ఊరిలో జరిగిందంటే ముందుగా బాధపడేవారు. తమ ఊరిలో జరిగిన విషయం బయటకు చెప్పుకోలేక పోవడం, తమ మనసులోనే నొప్పిని దాచుకోవడం ఇది చాలా పెద్ద బాధ” అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఈ సినిమా క్లైమాక్స్‌పై మరింత ఆసక్తి పెంచాయి గ్రామీణ కథల్ని పట్టుకుని చెప్పే ప్రయత్నంలో ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని టీమ్ నమ్ముతోంది. ఇక ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.