రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద హైప్ ఉంది. కానీ ఆశ్చర్యకరంగా,హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా వైపు గట్టిగా దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. ఇటీవల మహేష్ బాబు లుక్ బయటకు రాగానే, అంతర్జాతీయ సినీ కమ్యూనిటీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతోంది. ప్రత్యేకంగా యాక్షన్ జానర్ అభిమానులు మహేష్‌ను “ఇండియన్ జాన్ విక్ వైబ్స్”తో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : The Raja Saab: సిద్ధమవుతున్న ‘రాజాసాబ్’.. ఓవర్సీస్‌లోనే ముందే సంచలన బుకింగ్స్!
హాలీవుడ్‌కు సంబంధించిన పలు సోషల్ మీడియా పేజీలు, యాక్షన్ సినిమా కమ్యూనిటీస్, ఫ్యాన్ బ్లాగులు మహేష్ బాబు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, కేరెక్టర్ డిజైన్‌పై ప్రత్యేకంగా పోస్ట్‌లు షేర్ చేస్తూ కనిపిస్తున్నాయి. ఇది మహేష్ బాబుకు ఒక పెద్ద జర్నీ ప్రారంభమవుతున్న సూచనగానే కనిపిస్తుంది. ‘RRR’ తర్వాత రాజమౌళి సినిమాలు గ్లోబల్ మార్కెట్ లో భారీ క్రేజ్ సంపాదించిన నేపథ్యంలో, ‘వారణాసి’ అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా చేరువ అవుతుందని అనుకోవడం ఆశ్చర్యం లేదు. అలా అనేక విదేశీ యూజర్లు “ఇండియన్ స్టార్ టు వాచ్”, “సౌత్ ఏషియన్ యాక్షన్ ఐకాన్”, “హాలీవుడ్ స్క్రీన్స్‌లో చూసేందుకు ఎగ్జైటింగ్ ఫేస్” అని కామెంట్లు చేస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది మహేష్ బాబు హాలీవుడ్ వైపు జర్నీకి కేవలం ఆరంభం మాత్రమే. రాజమౌళి చేతుల్లో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత దృష్టిని ఆకర్షించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.