Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భగా లడఖ్‌లోని ద్రాస్ వద్ద ఆయన ప్రసంగించారు. ఒకవైపు భారతదేశం ఆవిష్కరణలు, అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తుంటే.. మరోవైపు పాకిస్థాన్ మాత్రం సరిహద్దు తీవ్రవాదానికే మద్దతు ఇస్తూ నాశనమవుతోందని స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. “భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. పాకిస్థాన్ మతోన్మాద కేంద్రాలను (Radicalisation centres) నిర్మిస్తోంది. భారత్ యూపీఐ (UPI) ద్వారా ప్రపంచాన్ని అనుసంధానిస్తుంటే, పాకిస్థాన్ హవాలా ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది” అని ఆయన ఎద్దేవా చేశారు.
భారత్ నవతరం స్టార్టప్‌ల సంస్కృతిని ప్రోత్సహిస్తుంటే, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాద ఆవాసాలను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. “భారతదేశం సెమీకండక్టర్లను తయారు చేస్తుంటే.. పాకిస్థాన్ ఆత్మాహుతి బాంబర్లను తయారు చేస్తోంది. భారత్ అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపుతుంటే, దాయాది దేశం సరిహద్దు దాటించి ఉగ్రవాదులను పంపుతోంది. ప్రపంచానికి భారత్ సాఫ్ట్వేర్ అందిస్తుంటే, పాక్ ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తోంది” అని రాజ్‌నాథ్ తీవ్ర పదజాలంతో విమర్శించారు. భారత్ పురోగతిని అడ్డుకోవడానికి ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా సహించేది లేదని, మన సాయుధ దళాలు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. అంతేకాకుండా, పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలైనా కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంశంపైనే ఉంటాయని, అది ఎప్పటికీ భారతదేశంలో భాగమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ స్పష్టమైన విధానాన్ని పునరుద్ఘాటించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మరోవైపు, 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించేందుకు ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ‘శ్రద్ధాంజలి సమారోహ్’ శౌర్య సంధ్య కార్యక్రమాలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రక్షణ మంత్రి, అమరజవాన్ల స్మారకం వద్ద నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపకార్థ కలశాలను అందజేశారు. ఆపరేషన్ విజయ్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహించారు. మంచుతో కప్పబడిన శిఖరాలను, శత్రువుల కాల్పులను లెక్కచేయకుండా 1999 జూలై 26న కార్గిల్ ఎత్తులను తిరిగి స్వాధీనం చేసుకుని భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రతీకగా ఈ రోజును ‘కార్గిల్ విజయ్ దివాస్’గా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!