Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- ప్రాంతీయ పార్టీల నేతలతో కనిమొళి వరుస సమావేశాలు
- ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, సుప్రియా సూలేతో ఇప్పటికే భేటీలు
- తాజాగా మమతా బెనర్జీతోనూ కనిమొళి సమావేశం
- థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Third Front: జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ‘‘థర్డ్ ఫ్రంట్’’కు పునాది పడుతుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి వరసగా ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్‌కు దూరంగా ప్రాంతీయ పార్టీలతో కొత్త కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు కొత్త కూటమిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
వరస భేటీలో కనిమొళి బిజీ బిజీ..
కనిమొళి ఇటీవల ముంబైలో శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్, ఇండియా కూటమి భవిష్యత్తు, ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చ జరిగినట్లు ఉద్ధవ్ సేన వర్గాలు తెలిపాయి. దీని తర్వాత కనిమొళి ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలేతో భేటీ అయ్యారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇదిలా ఉంటే, తాజాగా ఆమె టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో కోల్‌కతాలో సమావేశమయ్యారు. ఈ భేటీతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలతో కొత్త ఫ్రంట్ తయారవుతుందనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం మొదలైనట్లుగా చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్‌తో సంబంధాలు చెడిపోయిన తర్వాత డీఎంకే కొత్తగా థర్డ్ ఫ్రంట్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తమిళనాడులో నటుడు విజయ్‌కు చెందిన టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో డీఎంకే ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటోంది.
థర్డ్ ఫ్రంట్ కొత్తేమీ కాదు..
దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతంలో యూపీఏ కాకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు పలువురు ప్రయత్నించారు. 2013లో మమతా బెనర్జీ కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ దూరంగా ఉన్న పార్టీలతో ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుకు ప్రయత్నించారు. దీని తర్వాత 2018లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూడా మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తదితర ప్రాంతీయ నేతలతో చర్చలు జరిపారు. అయితే, ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి ప్రయత్నాలతో ప్రతిపక్ష రాష్ట్రాల సీఎంలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. య
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!