గత కొన్ని ఏళ్లుగా థియేటర్స్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది రీ రిలీజ్ ఫీవర్.. గతంలో సూపర్ హిట్స్ అయిన “మురారి”, “జల్సా”, “ఖుషి”, “దూకుడు”, “మగధీర”, “జగదేక వీరుడు అతిలోక సుందరి” లాంటి సినిమాలు మళ్లీ స్క్రీన్స్ మీదకు వచ్చి, యూత్‌ని, ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచాయి. హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఈ ఫ్యాన్ బేస్‌ని గమనించిన మేకర్స్ ఇప్పుడు మరో లెవెల్‌కి వెళ్తున్నారు. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రీ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు మాత్రం రెండు పార్ట్స్ కలిపి బ్రేక్ లేకుండా చూపించాలనుకున్నాడు జక్కన్న. ఇదొక కొత్త ట్రెండ్… రీ రిలీజ్ ఎపిక్ ఎరా మొదలైందనడానికి ఇదే సూచన.
Also Read : KantaraChapter1 : కాంతార చాప్టర్ 1 – ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎంత రావాలంటే?
రాజమౌళి ఎప్పుడూ కొత్త పంథా చూపిస్తాడు. బాహుబలి, భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆయనే రీ రిలీజ్ కి కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. కానీ ఇది పాత సినిమాలా కాదు ఒక కొత్త సినిమాలా, అన్నీ రీ డిజైన్ చేసి ఎక్స్ పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్‌ని మన కళ్లముందుకి తీస్కోస్తున్నాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌లో ఫైర్ క్రియేట్ చేస్తోంది. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ ఒకే సినిమాగా వస్తే ఎలా ఉంటుంది అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇప్పడు హాట్ టాపిక్. బాహుబలి ది ఎపిక్ మంచి వసూళ్లు సాధిస్తే, ఖచ్చితంగా పుష్ప 1 & 2 ను ఒకే సినిమాగా చూడాలనే డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే పుష్ప 3 కి ఇంకా టైమ్ ఉంది… అల్లు అర్జున్ – అట్లీ సినిమా కూడా థియేటర్స్ లోకి రావడానికి 2 ఏళ్లు టైమ్ పట్టేలా ఉంది. అందుకే పుష్ఫ ది ఎపిక్ రిలీజ్ చేస్తారని అభిమానుల ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
Also Read : Tollywood : తన సినిమాలకు తానే టైటిల్స్ పెడుతున్న స్టార్ హీరో
చోళ రాజుల గాథ అయిన పొన్నియన్ సెల్వన్ ను 1 & 2 పార్ట్స్ కలిపి ఒకే సినిమాగా లేటెస్ట్ ఫార్మాట్‌లో చూపిస్తే? అది కూడా మంచి కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. కోలీవుడ్ టాక్ ప్రకారం మణిరత్నం కూడా ఆ దిశలో ఆలోచిస్తున్నాడట. ఇది అంతా చూస్తుంటే “రీ రిలీజ్ ఎపిక్ ఎరా” మొదలైందని స్పష్టమవుతుంది. ఇక బాహుబలి రీ రిలీజ్ కేవలం సినిమా రివిజిట్ కాదు, భారత సినిమా భవిష్యత్తుకి కొత్త బ్లూప్రింట్. ఈ రీ రిలీజ్ కాన్సెప్ట్ వెనక స్ట్రాంగ్ బిజినెస్ లాజిక్ ఉంది. OTTలో కంటెంట్ రీప్లే అవుతున్నా, థియేటర్‌లో 70mm ఎక్స్‌పీరియెన్స్ నెక్ట్స్ లెవెల్.. సో మేకర్స్ ఇప్పుడు మేకింగ్ ఖర్చు లేకుండా మరోసారి కలెక్షన్స్ కొల్లగొట్టడానికి వేసే ఐడియా ఇది. ముఖ్యంగా “ఎపిక్ స్టోరీస్” ని రీ రిలీజ్ చేస్తే కొత్త జనరేషన్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడే పది ఏళ్ల పిల్లవాడు థియేటర్‌లో బాహుబలి మొదటిసారి చూస్తాడు. అది కేవలం సినిమా కాదు విజువల్ కల్చర్ రీబర్త్. ఇది సక్సెస్ అయితే త్వరలో “KGF కంప్లీట్ స్టోరీ లాంటివి కూడా రీ రిలీజ్ అవుతాయంటున్నారు ఫిలిం ఎనలిస్టులు. ఎందుకంటే ఎపిక్ అనేది గతం కాదు… ఎప్పటికీ ప్రస్తుతమే.