మాజీ డీఎస్పీ నళిని తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని ఇష్యూ పై స్పందించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును నళిని ఇంటికి పంపించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిశారు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నళినిని కలెక్టర్ కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాలన్నా..ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ ఆమెకు వివరించారు. సర్వీసు ఇష్యూలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి తెలియజేశారు కలెక్టర్ హనుమంతరావు.
Also Read:Gold Price Next 5 Year: రాబోయే 5 ఏళ్లలో బంగారం ధర ఎన్ని లక్షలు అవుతుందో తెలుసా?.. నిపుణుల అంచనా ఇదే!
కాగా నిన్న సోషల్ మీడియా పోస్టులో నళిని ఇలా రాసుకొచ్చారు.. ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవిక గా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నాఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. మూడు(3)రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. ఎనిమిది (8)ఏండ్ల క్రితం సోకిన Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు(= Blood cancer+ Bone Cancer) గత రెండు నెలలుగా టైపాయిడ్ , డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కనకణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి. తట్టుకోలేక పోతున్నాను అంటూ తన బాధను వెల్లడించింది.