ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్సింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ ( 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు ) అర్థశతకంతో రాణించగా.. ఆఖర్ లో ధ్రువ్ జురెల్ ( 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 34 పరుగులు ), దేవదత్ పడిక్కల్ ( 13 బంతుల్లో 5 ఫోర్లు 27 పరుగులు నాటౌట్ ) ధాటిగా ఆడడంతో స్కోర్ 200 పరుగులు దాటింది.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు వికెట్లు తీయగా మహేశ్ తీక్షణ, రవీంద్ర జడేజా ఒక్కొ వికెట్ పడగొట్టారు. ఓ రనౌట్ ఉంది. అయితే రాయల్స్ తమ 200వ మ్యాచ్ లో 200 పరుగుల టార్గెట్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందు ఉంచారు. జైపూర్‌లో ఇది ఇప్పటివరకు చేసిన అత్యధిక స్కోరు. CSK చేతిలో భారీ టాస్క్ ఉంది. వారు మంచు నుంచి కొంత సహాయం పొందితే తప్ప 203ని ఛేజింగ్ చేయడం అంత సులభం కాదు.
Read Also : Secretariate : సెంట్రల్ విస్టా కంటే తెలంగాణ సెక్రటేరియేటే ఎక్కువ..
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు తొలి నుంచే చెలరేగిపోవడంతో ఈజీగా 200 పరుగులు చేసింది. ఆర్ఆర్ జట్టు ఓపెనింగ్ జోడి రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ పవర్ ప్లేలోని 5వ ఓవర్ లోనే 54 పరుగులు చేసింది. 8వ ఓవర్ లో తొలి వికెట్ ( జోస్ బట్లర్ ) కోల్పోయిన.. జైశ్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ లైనఫ్ తో అదరగొట్టాడు. తరువాత నాలుగు ఓవర్లలో వరుసగా మూడు వికెట్లను రాజస్థాన్ జట్టు కోల్పోయింది. రాజస్థాన్ బ్యాటర్లు 17వ ఓవర్ నుంచి తిరిగి బ్యాట్ ఝలిపించడంతో లాస్ట్ 3 ఓవర్లలో ఏకంగా 40కి పైగా పరుగులు చేశారు. IPL చరిత్రలో ఈ గ్రౌండ్‌లో రాజస్థాన్ జట్టు 200 పరుగులు చేయడం ఇదే తొలిసారి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టార్టెట్ 203 పరుగులు.