IPL 2026: అస్త్రశస్త్రాలతో సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్లో ‘రాయల్’ విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ (RR) సిద్ధమైంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉన్న RR జట్టు .. మార్చి 30న తన తొలి మ్యాచ్ ఆడనుంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు డబుల్ ధమాకా కలగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్లో కొన్ని మార్పులు చేసిన బీసీసీఐ.. రాయల్స్ హోమ్ మ్యాచ్‌లను రెండు నగరాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది.
READ ALSO: US-Iran Conflict: పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’.. ఇరాన్‌పై బిగ్ యాక్షన్‌కు అమెరికా సిద్ధం..?
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
గౌహతి (అస్సాం): ఇక్కడ 3 కీలక మ్యాచ్‌లు (CSK, ముంబై, RCBలతో) జరగనున్నాయి.
జైపూర్ (రాజస్థాన్): మిగిలిన 4 హోమ్ మ్యాచ్‌లు పింక్ సిటీలో జరగనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (గౌహతి, 7:30 PM)
ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (గౌహతి, 7:30 PM)
ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (గౌహతి, 7:30 PM)
ఏప్రిల్ 13: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్, 7:30 PM)
ఏప్రిల్ 25: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (జైపూర్, 7:30 PM)
మే 24: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (ముంబై, 3:30 PM)
మళ్లీ 2008 సీన్ రిపీట్ అవుతుందా..
తొలి ఐపీఎల్ సీజన్ (2008)లో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. ఆనాడు ఫైనల్లో చెన్నైని ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టులో ఇప్పుడు అదే జోష్ కనిపిస్తోంది. ఈసారి జట్టులో రవీంద్ర జడేజా, శివం దూబే, సామ్ కర్రాన్ వంటి వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం. ముఖ్యంగా లోకల్ బాయ్ రియాన్ పరాగ్ తన సొంత గడ్డ గౌహతిలో చెలరేగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సీజన్లో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ జంపా, షిమ్రోన్ హెట్మేయర్, తుషార్ దేశ్‌పాండే, కుల్దీప్ సేన్ వంటి స్టార్ ప్లేయర్లతో రాజస్థాన్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సారి రాయల్ విక్టరీతో రాజస్థాన్ రాయల్స్ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్‌ను ముద్దాడుతారా లేదా అనేది.
READ ALSO: Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!