Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Industries: భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును తిరిగి విధించడమే ఈ పతనానికి ప్రధాన కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రిలయన్స్ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి, ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.82,000 కోట్లు మేర పడిపోయింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, సరఫరాలో కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
READ ALSO: MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో ఎంపీ కావ్య డిమాండ్..
Also Read
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
డీజిల్‌పై లీటరుకు రూ.21.5, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ.29.5 ఎగుమతి సుంకాన్ని పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో, ఇంధన రంగం నుంచి వచ్చే అదనపు లాభాలను నియంత్రించడం ప్రభుత్వ ఉద్దేశ్యం. ఒకవైపు ఎగుమతులపై పన్నులు పెంచిన ప్రభుత్వం, దేశీయ వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.3 తగ్గించగా, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది.
రిలయన్స్ ఎగుమతులపై ప్రభావం..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఏటీఎఫ్, డీజిల్ ఎగుమతిదారు. జామ్‌నగర్‌లోని రిఫైనరీలు భారత మొత్తం ఏటీఎఫ్ ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఎగుమతులపై పన్ను పెరగడం వల్ల కంపెనీ లాభదాయకత దెబ్బతింటుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించారు. కాగా, ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను రిలయన్స్ తీవ్రంగా ఖండించింది. రిలయన్స్ వంటి హెవీవెయిట్ స్టాక్ పడిపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రభావంతో సూచీలు దాదాపు 2% మేర నష్టపోయాయి. గత నెల రోజుల్లో రిలయన్స్ స్టాక్ సుమారు 3% పతనమవ్వడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.
READ ALSO: Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!
తాజావార్తలు
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!