Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rajasthan Elections 2023 Ec Arrenges Polling Booth For One Family In Rajasthan

Smallest Polling Booth: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్క కుటుంబం కోసం పోలింగ్‌ బూత్‌!

Published Date :November 25, 2023 , 8:34 am
By Sampath Kumar
Smallest Polling Booth: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్క కుటుంబం కోసం పోలింగ్‌ బూత్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

EC Arrenges Polling Booth for 35 Voters in Rajasthan: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియగా.. నేడు (నవంబర్ 25) రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లకు గాను.. నేడు 199 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. కరణ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌ సింగ్‌ కూనార్‌ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.

ఈ ఎన్నికల్లో ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న బార్మర్‌ జిల్లా పార్‌ గ్రామంలో 35 మంది కోసం పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. దాంతో రాజస్థాన్‌ రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్‌ కేంద్రంగా నిలిచింది. పార్‌ గ్రామంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే.. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Also Read: IPL Auction 2024: సొంత గూటికి హార్దిక్‌ పాండ్యా.. ఏకంగా 15 కోట్లు!

పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న పార్‌ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి ఏకంగా 20 కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. ఎడారిలో రోడ్లు సరిగా లేకపోవడంతో కాలినడకన, ఒంటెలపై వారు పోలింగ్‌ బూత్‌కు చేరుకొనేవారు. పోలింగ్‌ కేంద్రం 20 కిలోమీటర్ల దూరం ఉండటంతో కొందరు వృద్ధులు, మహిళలు తన ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. ఈ పరిస్థితి తెలుసుకున్న ఎన్నికల కమిషన్‌ అధికారులు.. పార్‌ గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఆ గ్రామ జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EC
  • Polling booth
  • Rajasthan
  • Rajasthan Elections 2023
  • Smallest Polling Booth

తాజావార్తలు

  • Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్

  • Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!

  • Vizag Crime: విశాఖలో యువతి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్..

  • Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

  • Gold-Silver Rates: సీజ్‌ఫైర్ వేళ గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions