Hardik Pandya Set to join Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తిరిగి సొంత గూటికి చేరనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు మారే అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించేందుకు ముంబై యాజమాన్యం సిద్ధంగా ఉందని సమాచారం. అయితే ఈ ట్రేడ్‌లో ముంబై నుంచి గుజరాత్ ఏ ఆటగాడినీ తీసుకోదట.
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో మరొక్క రోజులో ముగియనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హార్దిక్‌ను ట్రేడింగ్ విధానంలో తీసుకున్నట్లు ఇటు ముంబై ఇండియన్స్ గానీ.. అటు గుజరాత్ టైటాన్స్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ హార్దిక్ ముంబైకి తిరిగొస్తే.. అతడు రోహిత్ శర్మ సారథ్యంలో ఆడతాడా? లేదంటే అతడే కెప్టెన్‌గా ఉంటాడా? అన్నది ఆసక్తికరమే. మరోవైయిపు హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.
Also Read: IPL 2024: స్టార్ ఆటగాళ్లకు గుడ్‌బై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితా ఇదే!
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున ఏడు సీజన్లు ఆడాడు. 2022 సీజన్ ముందు ముంబై హార్దిక్‌ను వదులుకోగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. హార్దిక్ సారథ్యంలో గుజరాత్ టీమ్ వరుసగా రెండేళ్లు ఫైనల్ చేరింది. తొలి ఏడాది టైటిల్ గెలిచిన గుజరాత్.. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. హార్దిక్ జట్టు మారే విషయమై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.