రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.
అయితే మరో రెండు రోజుల్లో రెబల్ స్టార్ బర్త్ డే వస్తోంది. ఈ సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ ఈ నెల 23న ఉండబోతుందని హింట్ ఇస్తూ సంగీత దర్శకుడు తమన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ గురువారం ప్రభాస్ బర్త్ డేకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ లేదని తెలుస్తోంది. తమన్ ససాంగ్ అయితే రెడీ చేసేసాడు. అయితే యూనిట్ ప్రస్తుతం గ్రీస్ లో షూట్ లో ఉన్నారు. అక్కడి నుండి టీం వచ్చి క్వాలిటీ చెక్ చేసాక మార్పులు చేర్పులు ఏమి లేవు అనుకుంటే గాని సాంగ్ బయటకు రాదు. సో ప్రభాస్ బర్త్ డే కు సాంగ్ లేనట్టే. ఈ నేపధ్యంలో చిన్న పాటి గ్లిమ్స్ ఏదైనా ఇస్తారేమో చూడాలి. ఇక మరోవైపు రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా పౌర్ణమి, సలార్ 4K లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. నెలాఖరుకు బాహుబలి ఎపిక్ కూడా రిలీజ్ కానుంది.