తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఏడో బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపైనా కోర్టులో పిటిషన్ దాఖలు వేయడం కూడా ఆరోపణలకు కారణమైంది. తాజాగా రాజ లింగమూర్తి భార్య మరో అడుగు వేసింది.
READ MORE: Donald Trump: కెనడాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం టారిఫ్..
తెలంగాణ రాష్ట్ర డీజీపీని రాజలింగమూర్తి భార్య సరళ కలిశారు. తన భర్త రాజలింగమూర్తి హత్యపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. తన భర్త హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర, బీఆర్ఎస్ నేత హరిబాబు ఉన్నారని ఆరోపించారు. అనుమానితులపై కేసు పెట్టకుండా భూపాలపల్లి డీఎస్పీ తప్పుదోవ పట్టించారని లేఖలో పేర్కొన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌పై కేసు వేసినందుకు అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి బెదిరించాడని పేర్కొన్నారు. ఎవరితోనో పిటిషన్ రాయించి తన సంతకం తీసుకున్నారని సరళ తెలిపారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. తన భర్త రాజలింగమూర్తి హత్య కేసును సీబీసీఐడీ లేదా సీబీఐలకు అప్పజెప్పాలని కోరారు.
READ MORE: Donald Trump: కెనడాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం టారిఫ్..