Rajahmundry Road cum Rail Bridge : 50 వసంతాలను పూర్తి చేసుకున్న రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్
- గోదావరి జిల్లాలకు మణిహారంగా రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి
- 50 వసంతాలను పూర్తి చేసుకున్న రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి
- 1974 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry Road cum Rail Bridge : గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేస్తుంది. 1974 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తుంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండవ రోడ్ కం రైల్వే బ్రిడ్జిగా చరిత్రకు ఎక్కిన. దీనిపై నిత్యం పదివేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. 60 ఏళ్లు సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జి మనుగడ మరో 20 ఏళ్లు పెంచే విధంగా భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. బ్రిడ్జి శిధిలమైన చోట చేర్చి పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ వంతెన గోదావరి నదిని ఉమ్మడి రైలు, రోడ్డు మార్గాల ద్వారా దాటుతుంది. రాజమహేంద్రవరం నగరానికి, ముఖ్యంగా రైలు, రోడ్డు ప్రయాణాన్ని సమర్థవంతంగా అనుసంధానం చేస్తూ, వాణిజ్య, ఇతర రవాణా అవసరాలను తీర్చడానికి ఈ వంతెన కీలకమైనది. రాజమహేంద్రవరం రోడ్డు-రైలు వంతెన భారతదేశంలోని ప్రాచీన వంతెనల్లో ఒకటి.
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ఆత్మీయ వారధిగా రాజమండ్రి – కొవ్వూరు మధ్య నిర్మించబడిన ఈ బ్రిడ్జిని 1974 నవంబరు 23న అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ అలీ అహ్మద్ ఉధృతిగా జాతికి అంకితం చేశారు. ఈ వంతెన గోదావరి జిల్లాలను కలిపే అపురూపమైన ప్రాధాన్యత కలిగిన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. ఈ వంతెనను ఇంజినీరింగ్ అద్భుతంగా పరిగణించవచ్చు, ముఖ్యంగా రాజమండ్రి వద్ద మలుపులను స్మార్ట్‌గా డిజైన్ చేశారు. ఇది భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిల్లో మూడో స్థానంలో ఉంది. తొలి రెండు బ్రిడ్జిలు అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై మరియు బిహార్‌లో సోన్‌పూర్ వద్ద ఉన్నాయి. 1964లో మూడో పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు – రాజమండ్రి మధ్య ఒక రైల్ బ్రిడ్జి నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి గోదావరి జిల్లాలు లాంచీల ద్వారా మాత్రమే చేరుకునే ప్రాంతాలు.
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..
రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలనుకునే ప్రతిపాదన కేంద్రానికి పంపింది. ఆమోదం పొందిన తర్వాత, జెసోప్ కంపెనీ నిర్మాణం ప్రారంభించింది, 1974 ఆగస్టులో వంతెన పూర్తయింది. రైలు మార్గం 2.8 కి.మీ మరియు రోడ్ మార్గం 4.1 కి.మీ లభ్యమైంది. 1974 నవంబరులో అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది, అందరికీ ఈ సాంకేతిక అద్భుతాన్ని చూపిస్తూ ఉషశ్రీ ప్రతి క్షణాన్ని వర్ణించారు. లాంచీల ప్రయాణం ఆగిపోయింది, కొవ్వూరు – రాజమండ్రి మధ్య షటిల్ బస్‌లు ప్రారంభించబడినాయి. ఈ బ్రిడ్జి గోదావరి జిల్లాలను ఒకటిచేసింది, అందుకే ఈ బ్రిడ్జి గోదారోళ్లకు ప్రత్యేకమైనది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!