MP Margani Bharat: శభాష్ భరత్.. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ అయి ఉండి శభాష్ అనిపించుకునే పనిచేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడారు ఎంపీ. ఆ యువకుడి హృదయానికి ఏమి గాయమైందో, ఏమి కష్టం వచ్చిందో తెలియదు కానీ తనువు చాలించాలనే కఠోర నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నదే తడువుగా తన స్వగ్రామం ఉనకరమిల్లి (నిడదవోలు మండలం) నుండి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా బైక్ పై రాజమండ్రి- కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెనపైకి చేరాడు. బైక్ ఒక పక్కన బెట్టి, ఒక్కసారిగా బ్రిడ్జి పై నుండి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
సరిగ్గా అదే సమయంలో గోపాలపురంలోని ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కంట ఈ దృశ్యం పడింది. అంతే ఆయన వాహనాన్ని ఆపేశారు. కారులో నుండి ఒక్క ఉదుటున దూకి, ఆ వెనువెంటనే ఆ యువకుని కాలర్ పట్టుకుని వెనక్కి లాగారు. ఆ తరువాత యువకుని జబ్బ పట్టుకుని గట్టు (ఫుట్ పాత్)పై నుండి రోడ్డు మీదకు బలంగా లాగారు. అంతే ఎంపీ అనుచరులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆ యువకుడు హతాశుడయ్యాడు. కొద్ది సేపటి వరకూ షాక్ నుండి తేరుకోలేకపోయాడు.

నీకేం కష్టం వచ్చిందని ఎంపీ మార్గాని భరత్ చాలా అనునయంగా ఆ యువకుడిని అడిగారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో వెంటనే రాజమండ్రి టూ టౌన్ సీఐ టీ గణేష్ కు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇప్పించమని ఎంపీ భరత్ ఆదేశించారు. ఆటోలో కొంతమంది సహాయంతో నగరంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ యువకుని పేరు అయ్యప్ప అని, తండ్రి పేరు సీతాపతిరావు అని పోలీసులకు చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఆరవ సంతానంగా తాను జన్మించానని, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి, జడ్చర్ల అరబిందో ఫార్మసీ లో మూడు సంవత్సరాలు జాబ్ చేసినట్టు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. కాగా యువకుడిని కాపాడిన ఎంపీ భరత్ ను పలువురు అభినందించారు.
Read Also: Lexi: ఇండియా మొట్టమొదటి చాట్‌బాట్ ‘లెక్సీ’..బెనిఫిట్స్ ఇవే!
తాజావార్తలు
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!