Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vanitha TV 18th Anniversary Special Song: తెలుగు టెలివిజన్ రంగంలో మహిళల కోసం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఛానెల్ వనిత టీవీ 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2008 అక్టోబర్ 9న ప్రారంభమైన ఈ ఛానెల్ 18 వసంతాలు పూర్తి చేసుకుని మరో మైలురాయిని చేరుకుంది. మహిళా కేంద్రంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ, మహిళల సాధికారత, ఆరోగ్యం, జీవనశైలి, సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
స్త్రీ గొప్పతనాన్ని చాటే అద్భుతమైన పాట
వనిత టీవీ 18వ వార్షికోత్సవం సందర్భంగా స్త్రీ గొప్పతనాన్ని, సమాజంలో ఆమెకున్న ప్రాధాన్యతను చాటిచెప్పే అద్భుతమైన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్త్రీని సృష్టికి మూలాధారంగా, మమకారానికి ప్రతిరూపంగా, సహనానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ పాటలో అభివర్ణించారు. మహిళ జీవితంలోని గొప్పతనాన్ని, కుటుంబానికి, సమాజానికి ఆమె అందించే సేవలను హృద్యంగా ఆవిష్కరించారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
“జన ధరణికి నీవే మూలాధారం..
నీవే.. నీవే.. జగజ్జనని అవతారం..
ప్రతి బతుకున్న పరిమళము సుకుమారం..
నీవే ఈ సృష్టికి అలంకారం” అంటూ సాగే గీతం స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతోంది.
“మనుగడకే నువ్ ఆభరణం..
మమకారానికి వ్యాకరణం..
సహనం నీ సహజ గుణం..
శిరోధార్యమే నీ శ్రీ చరణం” అంటూ మహిళలోని ప్రేమ, సహనం, మమకారం వంటి గొప్ప లక్షణాలను కీర్తిస్తోంది.
“వనితా.. వనితా.. వనితా.. వనితా.. నీ వలనే మా చరిత.. భవిత..” అంటూ సాగే పల్లవి మహిళ ప్రాధాన్యతను, సమాజ భవిష్యత్తులో ఆమె పాత్రను చాటిచెబుతోంది. వనిత టీవీ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ పాట మహిళల గొప్పతనాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
కింది లింక్‌ను క్లిక్ చేసి.. వనిత టీవీ వార్షికోత్సవం ప్రత్యేక గీతాన్ని వీక్షించవచ్చు
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!