Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- ఎర్రవల్లి భూములపై క్షేత్రస్థాయి విచారణ షురూ
- సర్వే నంబర్ 325లో అసైన్డ్ భూములపై పరిశీలన
- 385 ఎకరాల్లో ఆక్రమణలపై అధికారుల ఆరా
- సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్న రెవెన్యూ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి భూముల వివాదంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను అధికారికంగా ప్రారంభించారు. ఎర్రవల్లి, దాని శివారు గ్రామాలైన వెంకటపూర్ , వరదరాజుపూర్ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న అసైన్డ్ భూములను అధికారులు శోధించి, పరిశీలిస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమగ్ర తనిఖీలు
ఏడీ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, , మర్కూక్ ఎమ్మార్వోల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ క్షేత్రస్థాయి విచారణను చేపడుతున్నాయి. సర్వే నంబర్ 325 పరిధిలోని అసైన్డ్ భూములు ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, ఎవరు కబ్జా చేశారనే విషయాలపై అధికారులు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి, వెంకటపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలోని పలు కీలక సర్వే నంబర్లలో భూముల కొలతలు , పరిశీలన ప్రక్రియ పూర్తయింది.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
385 ఎకరాల అసైన్డ్ భూముల్లో కబ్జాల గుర్తింపు
ఏ సర్వే నంబర్లో ఎంత మేర భూమి విస్తరించి ఉంది, అందులో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ పట్టా భూమి ఎంత అనే కీలక వివరాల సేకరణలో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. మొత్తం 385 ఎకరాల అసైన్డ్ భూమి పరిధిలో ఎంత మేర ఆక్రమణలు లేదా కబ్జాలకు గురయ్యిందనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!