Music Shop Murthy: పుష్ప కంటే ముందే మ్యూజిక్ షాప్ మూర్తి.. అదే అసలు పాయింట్: దర్శకుడు ఇంటర్వ్యూ
- అజయ్ ఘోష్ - చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో మ్యూజిక్ షాప్ మూర్తి
- జూన్ 14న మ్యూజిక్ షాప్ మూర్తి విడుదల
- దర్శకుడు శివ పాలడుగు ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Music Shop Murthy Movie Director Siva Paladugu Interview: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు.
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. అక్కడే నాకు ఫ్రెండ్‌గా హర్ష పరిచయమయ్యాడు. అమెరికాలో డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది, నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథకు అజయ్ ఘోష్‌నే ఎందుకు అనుకున్నారు?
పాతికేళ్ల కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్ అవుతుంది, కాస్త కొత్తగా ఉండాలని ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కథను రాసుకున్నాను. ఈ కథకు అజయ్ ఘోష్ అయితే బాగుంటుంది అనుకున్నాను. కాస్త కొత్తగా ఉంటుందనే ఆయనతో ఈ కారెక్టర్ వేయించాను. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.
చాందినీ చౌదరి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాను ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.
ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద ఏమైనా రీసెర్చ్ చేశారా?
మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం, పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.
బడ్జెట్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చాయా?
ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులు నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ ఖర్చు అయినా.. ఎక్కడా వృధాగా ఖర్చు పెట్టలేదు.
మొదటి సినిమా కదా, ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
నాకు మంచి టీం దొరికింది. ఆ టీం సహాయంతోనే సినిమాను ఇంత వరకు తీసుకు రాగలిగాను. అయితే సినిమా తీయడం కంటే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి మా సినిమా జూన్ 14న రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది.
ప్రస్తుతం పెద్ద సినిమాలే సరిగా ఆడటం లేదు.. మీకు మీ చిత్రంపై ఉన్న నమ్మకం ఏంటి?
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఇప్పుడు లేదు. చిన్న చిత్రాలకు ఓపెనింగ్స్ అంతగా రాకపోవచ్చు. కానీ కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తాయి. మా సినిమా కంటెంట్, మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.
చాందినీ చౌదరి రెండు చిత్రాలు ఒకే రోజు వస్తున్నాయి కదా?
చాందినీ చౌదరి గారు నటించిన ఏవమ్ సినిమా కూడా జూన్ 14వ తేదీన రిలీజ్ అవుతోంది. అయితే మా జానర్ వేరు.. ఆ సినిమా జానర్ వేరు.. వారికి సపరేట్ ఆడియన్స్ ఉంటారు.. మాకు సపరేట్ ఆడియన్స్ ఉంటారు. మా చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుంది.
ఈ చిత్రంతో ఏదైనా సందేశం ఇవ్వబోతున్నారా?
ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను.
మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
ఈ సినిమా సక్సెస్‌తోనే నా ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుంది. ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!