Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు?
- వెలుగులోకి కొత్త వీడియో
- ఊహాగానాలకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆరోగ్యం బాగోలేదని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ.. జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ‘‘ఇట్స్ ఓకే?’’ అని అడిగినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిన్‌పింగ్ ఆరోగ్యాన్ని ఉద్దేశించే మోడీ అలా అడిగినట్లుగా రకరకాలైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మాటల వెనుక ఏదో మర్మం ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదేమీలేదని మరికొందరు ఖండిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12-13 తేదీల్లో భారత్ మండపంలో బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరయ్యారు. సదస్సులో దేశాధినేతలు పలు అంశాలపై మాట్లాడారు. అయితే జిన్‌పింగ్ ఇయర్‌పీస్‌లో ఏదో సమస్య వచ్చింది. దీంతో ఆయన సరి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘‘ఇట్స్ ఓకే?’’ అని సంబోధించారు. తాజాగా రష్యా ప్రభుత్వ ప్రసార సంస్థ రొస్సియా-1 చిత్రీకరించిన వీడియోలో ఈ విషయాలు కనిపిస్తున్నాయి. వీడియోలో ఉన్న సందర్భాన్ని బట్టి చూస్తే.. మోడీ అడిగిన “ఇట్స్ ఓకే?” అన్న మాటలు జిన్‌పింగ్ ఆరోగ్యానికి సంబంధించినవి కాకుండా.. అనువాద పరికరంలో తలెత్తిన సమస్యకు సంబంధించినవై ఉండొచ్చనే చర్చ మొదలైంది. అయితే ఆ సమయంలో ఇరువురు నేతలు పూర్తిగా ఏం మాట్లాడుకున్నారో మాత్రం వీడియోలో తెలియలేదు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ చిన్న సంభాషణ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మోడీ ఆ మాట ఎందుకు అన్నారనే దానిపై పలువురు నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేశారు. మరికొందరు దీనిని జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితితో ముడిపెడుతూ ఊహాగానాలు చేశారు. అయితే మోడీ వ్యాఖ్యకు కచ్చితమైన కారణమని చెప్పడానికి ఆధారం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఊహాగానాలకు బ్రేక్?
కొత్త వీడియో బయటకు రావడంతో గతంలో వైరల్ అయిన క్లిప్‌పై సోషల్ మీడియాలో జరిగిన చర్చకు మరో కోణం వచ్చింది. కొందరు నెటిజన్లు గతంలో జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన ఊహాగానాలను విమర్శించారు. మరికొందరు “కుట్ర సిద్ధాంతాలను పక్కన పెట్టండి” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక మోడీ వ్యాఖ్యపై కథనాలు ప్రచురించడంపై పలువురు తప్పుబడుతున్నారు. ఇక సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
Contrary to the baseless rumors that circulate about Xi’s health: video proof that this 👇 is why Modi said “is it ok?” It’s because Xi’s earpiece for translation didn’t work, not because he had a health episode. https://t.co/VxFb0LRIXB
— Arnaud Bertrand (@RnaudBertrand) September 17, 2026
- Tags
- Brics summit
- Jinping
- modi
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!