తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో వానలు, ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఈ నెల 15న ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 16, 17 తేదిల్లో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయదిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read:Jana Sena: వారాహి ఆగదు.. పవన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండలు కూడా అధికంగా నమోదు అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలపైన నమోదయ్యాయి. గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39.8 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. భద్రాచలంలో సాధారణం కన్నా రెండు డిగ్రీలు పెరుగుదల నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లాలో 39.1, ఆదిలాబాద్ జిల్లాలో 39.1, జగిత్యాల జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, మెదక్‌లలో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయని అధికారులు వివరించారు.
Also Read:108 Ambulance: ప్రాణాలు కాపాడే వాహనానికే ఆపద!