Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని ఆగ్నేయ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చలికాలం ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఐరన్ లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో కూడా జనం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు అతుక్కుపోతున్నారు.
ఎక్కువగా ఖమ్మంలో..
శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 4.8 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాచలంలో 2.7 డిగ్రీలు పెరిగి 34.6 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో 2.3 డిగ్రీలు పెరిగి 32.8 డిగ్రీల సెల్సియస్, హనుమకొండలో 1.2 డిగ్రీలు పెరిగి 32.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని అధికారులు తెలిపారు.
రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు..
గత మూడు రోజుల నుంచి రాత్రి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు వివరించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు దుండిగల్‌లో 5.1 డిగ్రీలు పెరిగి 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వాతావరణం వాతావరణ శాఖ ప్రకారం నగరంలోని కొన్ని చోట్ల పొడి వాతావరణం, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
Bigg Boss 7 Telugu: అయ్యో పాపం భోలే.. ఆట పేరుతో పిచ్చ కొట్టుడు కొట్టారే..