Rain Alert: రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపినందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతున్నందున ఏవిధమైHarish Rao : వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి..న ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం నాడు జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సీఎస్ సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోకుండా ఉండేందుకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read : Kottu Satyanarayana: చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్..
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ఉదృతంగా ప్రవహించే కాజ్-వే లు, కల్వర్టులు, వంతెనలవద్ద ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకుగాను సంబంధిత మండల స్థాయి రెవెన్యూ, పిఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలి-కాన్ఫరెన్స్ ల ద్వారా సమీక్షించాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని, వర్షాలు, వరద ప్రాభావిత ప్రాంతాల్లో తగు సహాయ కార్యక్రమాలకి స్థానిక అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని కోరారు. వర్ష, వరద ప్రాభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించి వరద బాధిత కుటుంబాలకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, బాధితులకు ఆహారం, మంచినీరు, వైద్య తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లో తగు ముందస్తూ ఏర్పాట్లను చేయడంతోపాటు, మ్యాన్-హొళ్ళ పై కప్పులు తెరువకుండా నగర వాసులను చైతన్య పర్చాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Anushka Shetty : తన పెళ్లి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన అనుష్క..
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!