Nani : నరేష్ ను నేనే వాటికి కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఒకప్పుడు కామెడీ మూవీస్ తో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం రూట్ మార్చాడు.పక్కా యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు . ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.రీసెంట్ గా రిలీజ్ అయినా “ఆ ఒక్కటి అడక్కు” టీజర్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఏప్రిల్ 22న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను న్యాచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో నరేష్ కామెడీ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. ఈ సినిమాలో నరేష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “ఈ వేడుకకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నరేష్ ఇటువంటి వేడుకలకు రమ్మని నన్ను ఎప్పుడు అడగరు.ఒకవేళ అడిగితే ఆ సినిమా తనకు ఎంతగానో నచ్చినట్లు అర్ధం. ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టైటిల్ ఈవివి సత్యన్నారాయణ గారు డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ టైటిల్ కావడంతో ఈ సినిమాకు స్పెషల్ కనెక్షన్ ఉందని అనుకుంటున్నాను” అని నాని అన్నారు.నరేష్ ఎంతో అద్భుతంగా నటిస్తారు .అయితే తను వరుసగా కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేను అడిగాను.కానీ ఈ మూవీ ట్రైలర్ చూసాక బ్రేక్‌లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించిందని నాని తెలిపారు.ఈ సినిమాతో నరేష్ తనకు ఎంతో ఇష్టమైన జానర్ లో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు అని నాని తెలిపారు..
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!