Ashwini Vaishnav: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదు.. సిగ్నలింగ్ పాయింట్లో మార్పుల వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టంలో మార్పులు చేశారు.. ఆ మార్పుల వల్లే ఇంతటి ప్రమాదం జరిగింది.. కవచ్ లేకపోవడం ప్రమాదానికి కారణం కాదు.. సిగ్నలింగ్ పాయింట్లో మార్పులు చేసిన వారిని గుర్తించాం.. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయి.. సిగ్నలింగ్‌లో జరిగిన ట్యాంపరింగ్‌పై నివేదిక సిద్ధమైంది అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
Also Read: బంగ్లాపై నాభిని చూపిస్తూ రెచ్చగొడుతున్న రీతూ చౌదరి
Also Read
- Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
అయితే ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఉదయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. రైల్వే భద్రతా కమిషనర్ ఈ విషయంపై దర్యాప్తు చేశారు. దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదు.. విచారణ నివేదిక రావాలి అని అన్నారు. వాస్తవానికి ఇప్పుడు మా దృష్టి పునరుద్ధరణపై ఉంది. రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లు ఉన్నాయి. పని జరుగుతోంది. మేము ఖచ్చితంగా నిర్దేశించుకున్న లక్ష్యం సమయం కంటే ముందే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
Also Read: Top Headlines@1PM: టాప్ న్యూస్
దీనికి ముందే.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సహాయక చర్యలు, ట్రాక్ పనులపై ఆరా తీశారు. ట్రాక్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రికి సూచనలు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఆదివారం ఉదయం వరకు 288 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు.
తాజావార్తలు
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..