ఎల్లుండి తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఒకే రోజు ఐదు నియోజక వర్గాలలో రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు, పాదయాత్రలు చేయనున్నారు రాహుల్ గాంధీ.. పినపాక, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, రాజేంద్ర నగర్ నియోజక వర్గాలలో రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 17 న ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకోనున్నారు రాహుల్. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. పినపాక నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేటలో రాహుల్ గాంధీ ఉండనున్నారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్‌కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అనంతరం వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్ కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు రాహుల్ గాంధీ రానున్నారు. రాజేంద్రనగర్ సమావేశం అనంతరం ఢిల్లీ్కి రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణం కానున్నారు.