Rahul Gandhi: రాహుల్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఎమర్జెన్సీగా వయనాడ్‌కు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రకు (Bharat Jodo Nyay Yatra) తాత్కాలిక బ్రేక్ పడింది. హుటాహుటిన ఆయన తన సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్‌కు (Wayanad) బయల్దేరి వెళ్లారు. దీంతో ఆదివారం 3 గంటల వరకు యాత్ర వాయిదా పడింది.
రాహుల్ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో (Varanasi) కొనసాగుతోంది. శుక్రవారమే భారత్ జోడో యాత్ర యూపీలోకి ప్రవేశించింది. ఈనెల 21 వరకు ఉత్తరప్రదేశ్‌లో యాత్ర కొనసాగనుంది. అయితే శనివారం వారణాసిలో యాత్ర కొనసాగుతుండగా.. వయనాడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. వయనాడ్‌లో ఏనుగు దాడిలో మృతి చెందిన కుటుంబాన్ని రాహుల్ పరామర్శించనున్నారు. ఇందుకోసం రాహుల్ వారణాసి నుంచి వయనాడ్‌కు బయల్దేరి వెళ్తు్న్నారు.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
అటవీ శాఖకు చెందిన ఎకో-టూరిజం గైడ్ ఇటీవల ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ వయనాడ్ వెళ్తు్న్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్‌లో తెలియజేశారు.
రాహుల్ గాంధీ అత్యవసరంగా వయనాడ్‌లో వెళ్తున్నారని.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాల్లో ఉత్సాహంగా సాగుతోంది. కార్యకర్తలను, ప్రజలను కలుసుకుని ఉత్తేజాన్ని నింపుతున్నారు. వచ్చే నెలలో ఈ యాత్ర ముగియనుంది.
वायनाड में @RahulGandhi की उपस्थिति की तत्काल आवश्यकता है। वह आज शाम 5 बजे वाराणसी से प्रस्थान कर रहे हैं। भारत जोड़ो न्याय यात्रा कल 18 फरवरी को दोपहर 3 बजे प्रयागराज में फिर से शुरू होगी।
Rahul Gandhi’s presence is required urgently in Wayanad. He is leaving this evening from…
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2024
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!