Rahul Gandhi: మోడీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మోడీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సవాల్ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు నేడు సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణులను సంప్రదించి ఇప్పటికే ఆయన వ్యాజ్యం తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్‌కు వెళ్లనున్నారు. ఈ కేసులో తనని దోషిగా నిర్దారిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ నేలతో కలిసి ఆయన సూరత్ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాహుల్ గాంధీ ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
Read Also: Farmer : అధికారుల ముందే ప్రాణాలను తీసుకున్న అన్నదాత
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించి.. రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. అధికారిక నివాసాన్నీ ఖాళీ చేయాలని ఆదేశించింది. తనపై జీవితకాలం అనర్హత వేటు వేసినా.. మోదీ-అదానీలపై సంబంధంపై క్లారిటీ వచ్చే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ ఉద్ఘాటించారు. అదానీ షెల్ కంపెనీల్లోకి రూ.20వేల కోట్లు వచ్చాయని, ఆ డబ్బు ఆయనది కాదని, అది ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి భయపడే ఇప్పుడు నాపై అనర్హత వేటు వేశారని, శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసినా నేను భయపడేది లేదని, రూ.20వేల కోట్లు ఎవరివి అన్న ప్రశ్నకు జవాబు వచ్చేంతవరకూ నిలదీస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!