దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు నాయకుల మాటలు కూడా అంతే స్థాయిలో హీటెక్కుస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్నాయి. అయినా కూడా నేతలు ఎక్కడా తగ్గట్లేదు. తగ్గేదేలే.. అన్నట్టుగా మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మధ్య మోడీ ఆందోళనగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజాపుర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Samarth App: ఏపీ ఎన్నికలు 2024.. క్విక్ పోలీసింగ్ కోసం ఈసీ కొత్త యాప్
ఇటీవల మోడీ ప్రసంగాలు చూస్తుంటే.. ఆయన ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. రానున్న రోజుల్లో ఆయన వేదికపై కన్నీరు పెట్టినా పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యల నుంచి ఆయన తన మాటలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. కొన్నిసార్లు చైనా, పాకిస్థాన్ అంటారని… ఇంకొన్నిసార్లు గిన్నెల శబ్దం చేయమంటారని.. మరికొన్ని సార్లు మీ ఫోన్లలో టార్చ్‌లైట్ ఆన్ చేయమని చెబుతారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
దేశ వ్యాప్తంగా రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం ముగిసిన రెండో విడత పోలింగ్‌లో 61 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలస్తోంది.
ఇది కూడా చదవండి: KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..