NTV Telugu Site icon

Jana Garjana Meeting : సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్‌

Rahul Gandhi

Rahul Gandhi

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌ జనగర్జన సభకు హాజరయ్యేందుకు ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఖమ్మం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఏపీకి చెందిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగర్జన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు.

Also Read : AP ECET Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే..

 

ఇదే వేదికగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపు కూడా ఉంటుంది. అయితే.. ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి రాహుల్‌ చేరుకున్నారు. కాసేపట్లో సభా ప్రాంగణానికి భట్టి పాదయాత్ర చేరుకోనుంది. సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ జనగర్జన సభ ప్రారంభమైంది. స్టేజ్ పై 150 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేదిక వద్దకు పొన్నాల.. వీహెచ్‌.. మల్లు రవి తదితరులు చేరుకున్నారు. ఈ వేదికపై భట్టి విక్రమార్కను రాహుల్‌ గాంధీ సన్మానించారు. ఆయనతో పాటు రేవంత్‌ రెడ్డి కూడా రాహుల్‌ గాంధీ సన్మానించనున్నారు. ఈ వేదికనుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు రాహుల్‌ గాంధీ. ఈ జన గర్జన సభలో 5 పథకాలను కాంగ్రెస్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Sharad Pawar: చింతించడం లేదు.. ఇది కొత్త కాదు.. తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

Show comments