జూబ్లీహిల్సలోని పబ్‌లకు షాకిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ ను నిలిపివేయాలని సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైద్రాబాద్ రెస్ట్రోలాంబ్ అసోసియేషన్ లు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే.. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు జూబ్లీహిల్స్ లోని పబ్ లకు మాత్రమే వర్తిస్తుందని తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే.. గత నెలలో పబ్‌లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. పబ్‌ల విషయమై తీసుకున్న చర్యలపై నివేదికలను ఇవ్వాలని ముగ్గురు పోలీసు కమిషనర్లను, జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది.
Also Read : Gujarat Cable Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 12మంది బీజేపీ ఎంపీ కుటుంబీకులు
ఈ నేపథ్యంలో.. ముగ్గురు పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ తమ నివేదికలను గత నెల 26న కోర్లుకు సమర్పించారు. అయితే.. నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలకు సమీపంలో పబ్‌లను అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఈ క్రమంలో పబ్ ల వ్యవహారంపై హై కోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టి.. జూబ్లీహిల్స్ లో ఉన్న 10 పబ్‌లలో రాత్రి 10 తర్వాత ఎలాంటి సౌండ్స్‌ను పెట్టకూడదని వెల్లడించింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్ లో ఉన్న టాట్, జూబ్లీ 800, ఫర్జీ కేఫ్, అమ్నిషియ, హై లైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, బ్రాడ్వే, హార్ట్ కప్ పబ్‌లతో పాటు మరో పబ్‌లోనూ రాత్రి 10 తర్వాత ఎలాంట మ్యూజిక్‌ను ప్లే చేయకూడదని తీర్పునిచ్చింది హైకోర్టు.