Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్.. వెంట సోనియా, ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తదితరులు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ బరిలోకి దిగారు.
ఇది కూడా చదవండి:Komatireddy Venkat Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుంది..
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కుంచుకోటలాంటిది. ఇక్కడ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానంలో రాహుల్ రంగంలోకి దిగారు. వాస్తవానికి ఈ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి రాహుల్ బరిలోకి దిగారు.
ఇది కూడా చదవండి: Peddireddy vs Nallari: మరోసారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దిరెడ్డి హాట్ కామెంట్లు..
ఇక అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ నామినేషన్ సమర్పించారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు శుక్రవారమే ఆఖరితేదీ. ఈ స్థానాల్లో చివరి వరకూ సస్పెన్స్ కొనసాగించిన కాంగ్రెస్.. ఈ ఉదయమే అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈసారి రాహుల్ అమేథీని వదిలి రాయ్‌బరేలీకి మారడంపై బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి. అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
#WATCH | Uttar Pradesh: Congress MP Rahul Gandhi files nomination from Raebareli for the upcoming #LokSabhaElection2024
BJP has fielded Dinesh Pratap Singh from Raebareli. pic.twitter.com/R0IYOCnJA1
— ANI (@ANI) May 3, 2024
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!