Apples: గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ ఈ రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
- యాపిల్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన పండు
- రోజూ ఒక యాపిల్ తింటే వంద రోగాల నుంచి దూరం
- యాపిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు 7500 రకాల ఆపిల్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాపిల్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన పండు. రోజూ ఒక యాపిల్ తింటే వంద రోగాల నుంచి దూరం అవుతుందంటారు. అయితే యాపిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయని మీకు తెలుసా..? దాని రంగులను బట్టి పోషకాలు కూడా మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7500 రకాల ఆపిల్లు ఉన్నాయి. అయితే ఏ ఆపిల్ ఆరోగ్యానికి ప్రయోజనకరం, ఏ ఆపిల్‌లో ఎక్కువ పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Read Also: Big Breaking: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 30 మంది మావోయిస్టుల హతం..
Also Read
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
రెడ్ యాపిల్:
రెడ్ యాపిల్ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. దీని రుచి తీపిగా ఉంటుంది, దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. రెడ్ యాపిల్‌లో విటమిన్ సి, పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా.. ఇందులో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది. రెడ్ యాపిల్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
ఎల్లో ఆపిల్:
పసుపు యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ అత్యధికంగా ఉంటుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది. విటమిన్ ఎ కళ్లకు, పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. పసుపు యాపిల్ తినడం వల్ల శరీరంలోని అన్ని ఎముకలకు మేలు జరుగుతుంది.
గ్రీన్ ఆపిల్:
గ్రీన్ యాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఫైబర్ పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇందులో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. గ్రీన్ యాపిల్ బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దీన్ని ప్రతిరోజూ తింటే.. శరీరంలో విటమిన్ ఎ, సి పరిమాణం ఎప్పటికీ తగ్గదు. ఇందులో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడానికి, జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇవి రుచిలో పుల్లగా ఉంటాయి.
ఏ ఆపిల్ తింటే మంచిది..
ఏ ఆపిల్ తింటే మంచిదనే ప్రశ్న అందరికీ వస్తుంది. యాపిల్స్‌లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఎరుపు-ఆకుపచ్చ-పసుపు ఈ మూడింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే గ్రీన్ యాపిల్ తినవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
తాజావార్తలు
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..