ఇదివరకు ప్రకటించిన లిస్ట్ లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జడేజా కూడా ఒక భారత ఆటగాడు. జడేజా బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుండి క్యాప్ అందుకున్న ఫోటోలను పంచుకున్నారు. “ప్రత్యేక వ్యక్తి నుండి ప్రత్యేక క్యాప్” అనే పోస్ట్‌కు క్యాప్షన్ ను ఈ ఫోటోలకు జత చేసాడు జడ్డు భాయ్.
T20 World Cup 2024: న్యూయార్క్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా..
జడేజా, అశ్విన్‌లు గత ఏడాది టెస్టు క్రికెట్‌లో వారి ప్రదర్శన ఆధారంగా పాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టుకు ఎంపికయ్యారు. ఇక ఇందుకు సంబంధిచి పూర్తి జట్టు చూస్తే.. ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆర్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ లు ఉన్నారు. జడేజా తదుపరి 2024లో వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) భాగస్వామ్యం చేసిన వీడియోలో అతను మొదటిసారి న్యూయార్క్‌లో ఆడటం గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. మేము మొదటిసారి న్యూయార్క్‌లో ఆడబోతున్నాం, ఇది చాలా అద్భుతంగా ఉందని సరదాగా మాట్లాడాడు.
T20 World Cup 2024: న్యూయార్క్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా..
పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యునైటెడ్ స్టేట్స్‌తో పాటు భారతదేశం గ్రూప్ Aలో ఉంది. జూన్ 5, బుధవారం న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ తో రోహిత్ శర్మ జట్టు టోర్నీని ప్రారంభించనుంది.