Ragi Aaviri Kudumu Recipe: ఇనుము లాంటి బలాన్నిచ్చే టిఫిన్.. ‘రాగి ఆవిరి కుడుము’ చేసేయండి ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Aaviri Kudumu Recipe: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎముకల బలానికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి ఒక అద్భుతమైన ఆహారం. మరి ఈ రాగులతో ఎంతో రుచికరమైన, బలవర్ధకమైన “రాగి ఆవిరి కుడుము” ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు
* ఉప్పుడు బియ్యం (లేదా మామూలు బియ్యం) – 1/2 కప్పు
* మినపప్పు – 1/4 కప్పు
* ఉప్పు – రుచికి సరిపడా
* నీళ్లు – తగినన్ని
Also Read
- Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. 'నీలోఫర్' అసాధారణ ప్రయాణం.!
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
- Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు...
Ragi Thopa Recipe: సాంప్రదాయ రుచి, కాల్షియం, ఐరన్‌తో నిండిన ‘రాగి తోపా’.. ఇలా చేసేయండి!
తయారీ విధానం:
మొదటగా మినపప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ నానిన పప్పు, బియ్యాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఇడ్లీ పిండిలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి.
ఇలా ఉన్న మిశ్రమాన్ని కనీసం 7 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల కుడుములు మృదువుగా వస్తాయి. పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆవిరి కుడుము పాత్రను లేదా ఇడ్లీ పాత్రను తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాయాలి. పాత్రలో పిండిని వేసి, ఆవిరి మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. కుడుము ఉడికిన తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి తీసుకోవాలి.
ఈ రాగి ఆవిరి కుడుమును వేడివేడిగా అల్లం చట్నీ లేదా వేరుశనగ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది మంచి పోషకాహారం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీనిని ప్రయత్నించి ఎలా ఉందో ఒక కామెంట్ చేసేయండి.
తాజావార్తలు
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
-
Dhamaal 4 Trailer : దెయ్యాలు సముద్రపు దొంగలతో గోల్ మాల్… “ధమాల్ 4” ట్రైలర్ మామూలుగా లేదుగా
-
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..