Raghunandan Rao : సూట్ కేసులు పట్టుకొచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్‌లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. అలా అయితే బీఆర్ఎస్ పార్టీ దుకాణాన్ని బంద్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మెదక్ సీటును ఆ పార్టీ ఇతర ప్రాంతాల వారికి అమ్ముకున్నదని ఆరోపించారు. సూట్ కేసులు ఇచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు.
ఈ గడ్డ మీద పుట్టిన వాడు… ఈ గడ్డ మీద పోరాడే వ్యక్తి బీఆర్ఎస్కు ఎందుకు దొరకలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టిన తర్వాత కూడా సూట్ కేసులు ఇచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం దారుణం అన్నారు. పదేళ్లు పాలించిన పార్టీకి స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరి కోసం పని చేస్తుందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రజలు కూడా ఓసారి ఆలోచించాలని కోరారు.
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తోంది… మీరు అన్నా… మీ కుటుంబం అన్నా ద్వేషిస్తోంది… సమాజం ద్వేషం పగగా మారకముందే బీఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.. ఇంతకుముందే కరీంనగర్ జిల్లా వ్యక్తిని తెచ్చుకొని మెదక్ జిల్లాను నాశనం చేశారు… ఇప్పుడు ఇంకొక కరీంనగర్ వ్యక్తి ఈ ప్రాంతాన్ని నాశనం చేసేందుకు వస్తున్నాడు… కాబట్టి ఆలోచించాలని కోరారు. పక్క జిల్లాల పెత్తనం మనకు వద్దు… 610 జీవో అమలు జరగాలంటే పక్క జిల్లాల పెత్తనం మెదక్ జిల్లాపై వద్దు… పైసల కోసం సీట్లు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!