MP Raghav Chadha: పార్లమెంట్‌లో రూ.19 వేల కోట్ల బ్యాంకుల గుట్టు విప్పిన ఎంపీ రాఘవ్ చద్ధా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Raghav Chadha: భారతదేశ బ్యాంకింగ్ రంగంలో సామాన్యులపై జరుగుతున్న ఒక ‘నిశ్శబ్ద దోపిడీ’ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా పార్లమెంటు వేదికగా ఎండగట్టారు. బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహించలేదనే నెపంతో గత మూడేళ్లలో బ్యాంకులు ఏకంగా రూ.19,000 కోట్లు పెనాల్టీల రూపంలో వసూలు చేశాయని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
READ ALSO: LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం.. ఇలా చేయండి..
Also Read
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ఎవరి జేబుల నుంచి ఈ నిధులు..
ఈ సందర్భంగా రాఘవ్ చద్ధా తన ప్రసంగంలో ఈ వసూళ్ల వెనుక ఉన్న చేదు నిజాలను వివరించారు. ఈ వేల కోట్లు బిలియనీర్ల నుంచో లేదా బడా పారిశ్రామికవేత్తల నుంచో వచ్చినవి కావని, ఇవి పూర్తిగా రైతులు, పెన్షనర్లు, రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజల కష్టార్జితమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రైవేట్ బ్యాంకులు సుమారు రూ.11,000 కోట్లు వసూలు చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) సుమారు రూ.8,000 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకులు సామాన్యుల నుంచి భారీగా పెనాల్టీలు వసూలు చేయడంలో ముందున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి.
మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు జరిమానా విధించడాన్ని రాఘవ్ చద్ధా “పేదరికంపై వేసిన పన్ను”గా అభివర్ణించారు. ఒక రైతు తన అవసరాల కోసం అకౌంట్ ఖాళీ చేసినప్పుడు లేదా ఒక పెన్షనర్ మందుల కోసం డబ్బు తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకులు సేవలు అందించాల్సింది పోయి, రివర్స్‌లో రూ.100 నుంచి రూ.500 వరకు పెనాల్టీలు వేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ, సాధారణ సేవింగ్స్ ఖాతా కలిగిన కోట్లాది మంది సామాన్యులు ఈ పెనాల్టీల భారంతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.
పెనాల్టీలు రద్దు చేయాల్సిందే..
బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చుల పేరుతో ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని, ఈ మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ (RBI)ని డిమాండ్ చేశారు. నిజమైన ఆర్థిక సమతుల్యత సాధించాలంటే పేదవారిపై ఈ భారాన్ని తొలగించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ వేదికగా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “చివరికి సామాన్యుడి బాధను వినిపించే గొంతుక పార్లమెంటులో వినిపించింది” అంటూ నెటిజన్లు రాఘవ్ చద్ధాకు మద్దతు తెలుపుతున్నారు.
₹19,000 crore.
That is what Banks collected in last 3 years just for not maintaining ‘Minimum Account Balance.’
Not from the rich. Not from big borrowers.
From the poorest accounts in the system.
Their crime? They didn’t have enough money.A farmer misses the minimum balance… pic.twitter.com/DqZ1CSCOoV
— Raghav Chadha (@raghav_chadha) March 17, 2026
READ ALSO: Sarke Chunar Song: మంగ్లీకి ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా నెటిజన్లు ఫైర్ !
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!