ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రచారంలో హోరేత్తిస్తున్నాయి.. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వాడివేడిగా మారాయి.. అందులో పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది.. సినీ ప్రముఖుల సపోర్ట్ కూడా ఉంది.. ఆయన ప్రజలకు చేస్తున్న మేలు తెలుసుకున్న సెలెబ్రేటీలు ఆయన ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. తాజాగా చిరంజీవి హీరోయిన్ పవన్ కు జై కొట్టింది..
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇండస్ట్రీలోని హీరోలు బలంగా కోరుకుంటున్నారు.. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ప్రచారాలు, ర్యాలీలు అంటూ తిరిగారు. ఇక జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.. పవన్ కళ్యాణ్ గెలిపించాలని రిక్వెస్ట్ చేశారు..
ఇక తమిళ హీరోయిన్లు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాలని మద్దతుగా తెలుపుతున్నారు.. సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి పవన్ కు మద్దతు తెలపగా, ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపింది.. చిరంజీవి హీరోయిన్ రాధిక శరత్ కుమార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసింది.. మీకు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు ముందుగా మీ సేవ ప్రజలకు మరింత బలం చేకూర్చాలని కోరుకుంటున్న అంటూ ట్వీట్ చేసింది.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Wishing you well @PawanKalyan may your service first to people have more strength, #NDA #Pithapuram @BJP4India pic.twitter.com/roMBLupOJa
— Radikaa Sarathkumar (@realradikaa) May 11, 2024