ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ సంచలనంగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్ట కెప్టన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా మరో స్టార్ ప్లేయర్ ఫ్రాంచైజీ మారనున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ చేసుకోనున్నట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి.
Read Also: Nani: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. నాని ఏమన్నాడంటే.. ?
అయితే, డికాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ లో బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. గత కొన్ని సీజన్ల నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు సరైన ఓపెనింగ్ జోడి లేకపోవడంతో డికాక్‌ను దక్కించుకోవాలని సన్ రైజర్స్ చూస్తుంది. ఇప్పటికే లక్నోతో పాటు డికాక్‌తో కూడా ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం సంప్రదింపులు చేసినట్లు టాక్. కాగా ఐపీఎల్-2023 మినీ వేలంలో డికాక్‌ను రూ. 6.75 కోట్లకు లక్నో దక్కించుకుంది. ఐపీఎల్-2024 సీజన్‌కు కూడా అతడినికి లక్నో రిటైన్ చేసుకుంది. ఇప్పటి వరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డికాక్.. 2907 రన్స్ చేశాడు. టెస్టు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన డికాక్.. కేవలం టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. కాగా ఐపీఎల్-2024కు సంబంధిచిన వేలం పాట డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరుగబోతుంది.