రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకంతో పాటు కంజుల పెంపకం కూడా చేస్తున్నారు.. ఇవి చూడటానికి పిచ్చుకల మాదిరిగా ఉంటూ కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.. అందుకే వీటిని తినడానికి మాంసపు ప్రియులు ఇష్ట పడతారు.. దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. రైతులు వీటిని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు..
పెడ్డులో పెంచుకోవడానికి జపనీస్ క్వయిల్ అనువైన రకం. ఈజపనీస్ క్వయిల్ ను మాంసం గుడ్లు ఉత్పాదన కోసం పెంచుకోవచ్చు. మిగతా కోళ్ల రకాలతో పోలిస్తే కంజు పిట్టలకు వ్యాధి నిరోధకత చాలా ఎక్కువ. ఎటువంటి టీకాలు అవసరం లేదు. ఇకపోతే ఈ పిట్టలను ఐదు వారాలకే మాంసం కోసం అమ్ముకోవచ్చు.. లేదంటే ఆరోవారం నుంచి గుడ్లు పెడతాయి..ఐదు వారాల వయస్సులో ఇవి 100-200 గ్రా వరకు బరువు తూగుతాయి. వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల మాంసం కంటే అధిక మోతాదులో లభిస్తాయి. దేశంలోని మొత్తం కోళ్ల సంఖ్యలో 1.8 శాతం కంజు పిట్టలున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు పెరిగిన తలసరి ఆదాయం కలిగిన అవగాహన వల్ల నేడు రైతులు ప్రత్యామ్నాయ కోళ్ల పట్ల మక్కువ చూపిస్తున్నారు..
ఇవి బూడిద రంగులో ఉంటాయి.. బయట మార్కెట్లో పిల్లలు లభ్యం అవుతాయి. పిల్లలు ఏడు తొమ్మిది గ్రాముల బరువు ఉండి సున్నితంగా ఉంటాయి. వీటికి మొదటి వారంలో 95, 99 ఫారన్ హిట్ వరకు వేడిని అందించాలి. మొదటి వారంలో తీసుకునే జాగ్రత్తలు దాదాపు ఫారన్ హిట్ కోడి పిల్లల బ్రూడింగ్ మాదిరిగానే చేసుకోవాలి కాకపోతే కంజు పిట్టలు చిన్నపాటి శరీరం వలన వాటికి మామూలు ఇతర కోడి పిల్లల కంటే అధిక ఉష్ణోగ్రతను అందించాలి..ఒక బ్రీడర్ 100- 150 అంగుళాలు వెడల్పుగా ఉంటే దానిలో 250- 300 వరకు పిల్లలను ఉండవచ్చు. మొదటివారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతను ఐదు ఫారెన్ హిట్ చొప్పున తగ్గిస్తూ అది 70- 75 ఫారం హిట్ వచ్చేవరకు బ్రీడింగ్ చేయాలి. దాదాపు మూడు వారాల వయసు వచ్చేసరికి ఈకలు బాగా పెరిగిన తరువాత మగ ఆడ కంజులను వేరు చేయవచ్చు..
సాదారణంగా మగవాటి కన్న కూడా మగ కంజులు ఎక్కువ బరువు తూగుతాయి.. ఐదు వారాలు జాగ్రత్తగా పెంచితే మంచి లాభాలను పొందవచ్చు.. గుడ్లు కోసం అయితే ఆరోవారం నుంచి 14 వారాల వరకు ఇవి గుడ్లు పెడతాయి.. ఏడాదికి దాదాపు 250 270 గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గుడ్లు 10 12 గ్రాముల బరువు ఉండి, పెంకు కొంచెం నల్లని మచ్చలతో ఉంటుంది. పోషణ పరంగా కోడిగుడ్డు కంటే రెండు శాతం అధిక మాంసకృతులు ఇందులో లభ్యమవుతాయి. కంజు పిట్టలకు, మిగతా కోళ్ల కంటే కొంచెం అధిక మోతాదులో మాంసకృతుల అవసరం. బయట మార్కెట్లో ప్రత్యేకంగా కంజు పిట్టలు దాణా లభిస్తే దొరికిన దాణాకి కొద్ది మోతాదుల అవసరం మేరకు సోయా చెక్కని కలిపి వాడుకోవాలి.. దాణా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే అవి మంచి సైజు పెరుగుతాయి.. కాస్త జాగ్రత్త పడాలి అప్పుడే మంచి ఆదాయాన్ని పొందవచ్చు..