NTV Telugu Site icon

PVR Inox IPL: గుడ్‌న్యూస్.. పీవీఆర్‌ ఐనాక్స్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారం..

Pvr

Pvr

ప్రముఖ మల్టీప్లెక్స్‌ చైన్‌ పీవీఆర్‌ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్‌ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్‌ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

READ MORE: Mahesh Babu : మహేశ్, సితార అదిరిపోయే స్టిల్స్.. మామూలుగా లేవుగా..

హై డెఫినిషన్ స్క్రీన్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ ద్వారా స్టేడియం అనుభూతి వస్తుందని ఐనాక్స్‌ రెవెన్యూ, ఆపరేషన్స్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా తెలిపారు. గతేడాది క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసారంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆందకే ఈ ఏడాది కూడా ప్రీమియం క్వాలిటీ ఎక్స్‌పీరియన్స్‌ అందించే ఉద్దేశంతో ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల్లోని ప్రధాన మెట్రో నగరాలతో పాటు, టైర్‌-2, టైర్‌-3 సిటీల్లో ఈ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ప్లేఆఫ్స్, క్వాలిఫయర్లు, ఫైనల్ మ్యాచ్‌లను థియేటర్లలో వీక్షించేందుకు అవకాశం ఉంది. టికెట్లు పీవీఆర్, ఐనాక్స్ వెబ్‌సైట్, యాప్స్, బుక్మైషోలో అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉండగా.. మరికొద్ది సేపట్లో.. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ఓపెనర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడనున్నాయి. కోల్‌కతాలోని పాపులర్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు హోస్ట్‌గా ఉంది.

READ MORE: KKR vs RCB: కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్.. మొదటి మ్యాచ్‌కు వరుణుడు కరుణిస్తాడా?