ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.