Puvvada Ajaykumar : అభివృద్ధి, సంక్షేమం లో కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసిండు
- మనల్ని మన పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేశారు
- పగడాల నాగరాజు, దేవాభక్తుని కిషోర్ వంటి వారిని జైల్లో పెట్టారు
- మిత్తి పద్దు కాకుండా ప్రజల సమస్యల పద్దు రాయాలి :పువ్వాడ అజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puvvada Ajaykumar : డివిజన్ లో ప్రజా సమస్యలు డైరీ లో రాయాలి, బయటకు వెళ్ళేప్పుడు డైరీ తీసుకుని వెళ్లి రాసుకోండన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం రెచ్చిపోయారని, మనల్ని మన పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసం లో పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పగడాల నాగరాజు, దేవాభక్తుని కిషోర్ వంటి వారిని జైల్లో పెట్టారని, కర్నాటి కృష్ణ మీద అక్రమ కేసు పెడితే, డివిజన్ ప్రజలు రెండు వందల మంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్తే కేసు వాపసు తీసుకున్నారన్నారు. మిత్తి పద్దు కాకుండా ప్రజల సమస్యల పద్దు రాయాలి, మన ప్రభుత్వం వచ్చాక అంతకంతకూ తిరిగి చెల్లిద్ధామని ఆయన వ్యాఖ్యానించారు. మీ అందరి నుండి డైరీ లను తీసుకుని మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారికి మిత్తికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 17 వ తేదీన కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలి, మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కేసీఆర్ దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అన్నందుకు రేవంత్ రెడ్డి ముందు లేచి నిలబడమని అంటున్నాడు ఆ వయసులో అలా మాట్లాడటం గొప్ప అని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న ఒక్క హామీ నెరవేర్చలేదు, ఇచ్చిన హామీల మీద మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించారు.. ట్విట్టర్ అకౌంట్ లో పాలన బాగుందా అంటే ఫాం హౌస్ పాలన బాగుందా, ప్రజా పాలన బాగుందా అంటే 70 శాతం ప్రజలు ఫాం హౌస్ పాలన బాగుంది అని తీర్పు ఇచ్చారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ లలో అదే పురుగుల అన్నం పెడుతున్నారు.. ఒక సంవత్సర పాలన చూస్తుంటే రారా అని వచ్చి ప్రశ్నిస్తే తిరిగి ఆయన వయసు పై అసభ్యమైన పదజాలంతో మాట్లాడాడు సీఎం.. కిందపడి కాలు విరగకొట్టుకున్న ఆయన లేచి నిలబడ్డాడు, ఆయన కనీసం కర్ర కూడ పట్టుకుని నిలబడలేదు.. ఆయన లేకుంటే టీపీసీసీ లేదు, నీకు సీఎం పదవి లేదు.. అభివృద్ధి, సంక్షేమం లో కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసిండూ.. ఒకసారి అధికారాన్ని ప్రజలు మీకు ఇచ్చి ఉండొచ్చు కానీ మళ్ళీ ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను..
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
ప్రజలు 10 ఏళ్లలో కేసీఆర్ ను అసభ్య పదజాలంతో దూషించలేదు, కానీ నేడు మహిళలు సైతం నిన్ను దూషిస్తున్నారు.. జనవరి 26 తేదీన టింగు టింగు మంటూ ఫోన్ లో డబ్బులు పడతాయి అన్నారు, టింగు లేదు బొంగు లేదు.. మనప్పుడు టక టక మంటూ శబ్దాలతో డబ్బులు పదేవి.. వారం రోజుల్లో రైతులకు రైతు బంధు పడేది.. అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మేము పర్యటిస్తే రైతులు చనిపోయిన వారికి లక్ష రూపాయలు ఇస్తే రైతులు నలుగురు నెలకు ఒకరు చొప్పున చనిపోతే రైతులకు రైతు భీమా ఇవ్వలేదు.. అదే బోధ్ నియోజకవర్గం లో మరో రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… ప్రభుత్వ విధానాల వలన ప్రజలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.. రైతులు పంట మార్కెట్ కు తీసుకుని వస్తె మార్కెట్ లో జెండా పాట 14 వేలు ఉంది, మనప్పుడు 18 వేలు ఉండేది.. పత్తి కి నేడు మార్కెట్ లో 6 వేలు మద్దతు ధర వస్తె గొప్ప… ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయ్యింది, అంటే పంట కాలాలు మూడు అయిపోయాయి… రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆనాడు రైతు బంధు 10 వేలు ఇస్తుంటే బిచ్చమని, మేము 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించాడు.. ఆ రోజు 12 వేలు మాత్రమే ఇస్తా అని ఎందుకు చెప్పలేదు, రుణమాఫీ అందరికీ ఇస్తా అని ఇప్పుడు కొందరికే ఎందుకు ఇస్తున్నారు.. రెండు లక్షలు పైన ఉన్నవాళ్ళకు ఎందుకు ఇవ్వను అంటున్నారు.. ఇచ్చిన హామీల మీద పోరాటం చేయాలని కేసీఆర్ అంటే ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా తూలుతున్నవ అనడం సరికాదు.. గతంలో కేసీఆర్ ను తిడితే ప్రజలు ఊరుకునే వారు కానీ ఇప్పుద్ మాత్రం అస్సలు సహించడం లేదు.. ఇంకా రెండు డైరీ లు మాత్రం కరెక్ట్ గా కాపాడుకోండి తర్వాత మనం ఏం చేయాలో అది చేద్దాం.. మన యువ నాయకుడు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఉర్రుతలు ఊగుతుంది.. మా సభల బయట మీరు పల్లీలు అమ్ముకునే రోజులు వస్తున్నాయి, విర్రవీగకండి.. ఒక్క సంవత్సరంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబ్దాం.. మొదటి సంవత్సరం మా కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు, మేము ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాం.. కేసీఆర్ ఒకానొక రోజు రేవంత్ రెడ్డికి ఓ మహానుభావుడి లా కనిపిస్తాడు’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!