ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- గాలి లీకేజీ పెరిగినట్లు గుర్తించిన నాసా
- అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యోమగాములకు ప్రత్యేక హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో గాలి లీకేజీ సమస్య మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్రమత్తమైంది. రష్యాకు చెందిన జ్వెజ్డా (Zvezda) సర్వీస్ మాడ్యూల్‌లోని ట్రాన్స్ఫర్ టన్నెల్ ప్రాంతంలో గాలి లీకేజీ పెరిగినట్లు గుర్తించిన నాసా, అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యోమగాములకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ISSలో ఉన్న వ్యోమగాములు అవసరమైతే అత్యవసర తరలింపునకు సిద్ధంగా ఉండాలని నాసా సూచించింది. ఇందుకోసం వారు తమకు అనుసంధానించబడిన అంతరిక్ష నౌకల్లోనే ఉండాలని, స్పేస్సూట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది.
నాసా క్రూ-12 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న నలుగురు వ్యోమగాములు.. అమెరికాకు చెందిన ఇద్దరు, ఫ్రాన్స్‌కు చెందిన ఒకరు, రష్యాకు చెందిన ఒకరు.. తమ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి ప్రవేశించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచారం. గాలి లీకేజీ మరింత పెరిగి అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే తరలించేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు నాసా అధికారులు వెల్లడించారు.
Also Read
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
కారణం గుర్తించేందుకు ప్రయత్నాలు
గత కొన్ని నెలలుగా నాసా, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఈ గాలి లీకేజీకి కారణాలను గుర్తించేందుకు సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సమస్యకు ఖచ్చితమైన కారణం నిర్ధారణ కాలేదు.
ఇటీవలి వరకు లీకేజీ స్థాయి చాలా స్వల్పంగానే ఉన్నప్పటికీ, తాజాగా అది పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సోమవారం నుంచి గాలి లీకేజీ రోజుకు ఒకటి నుంచి రెండు పౌండ్ల మేర పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో అంతరిక్ష కేంద్రం భద్రతపై నాసా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యం
ప్రస్తుతం వ్యోమగాములందరూ సురక్షితంగానే ఉన్నారని నాసా తెలిపింది. అయితే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే అత్యవసర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. గాలి లీకేజీ సమస్యను పరిష్కరించేందుకు రష్యన్ ఇంజినీరింగ్ బృందం కక్ష్యలోని తమ విభాగంలో మరమ్మతు పనులు కొనసాగిస్తోంది.
తాజావార్తలు
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!