Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు
- తొలి రెండు రోజుల్లోనే మొత్తం 33 వికెట్లు పడ్డాయి.
- మొదటి రోజు 16 వికెట్లు, రెండో రోజు 17 వికెట్లు కూలడంతో కొనసాగుతున్న బౌలర్ల ఆధిపత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మ్యాచ్ తొలి రెండు రోజుల్లోనే మొత్తం 33 వికెట్లు పడిపోవడంతో పిచ్ స్వభావంపై చర్చ మొదలైంది. మొదటి రోజు 16 వికెట్లు కూలగా, రెండో రోజు మరో 17 వికెట్లు పడడంతో.. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండగా, సీమర్లు మాత్రం వికెట్ల పండుగ చేసుకుంటున్నారు.
మ్యాచ్ వివరాలు:
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కైల్ జేమిసన్ ఐదు వికెట్లు, నాథన్ స్మిత్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అయితే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒల్లీ రాబిన్సన్ అద్భుత బౌలింగ్‌తో కివీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర వరుసగా విఫలమవడంతో జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. రాబిన్సన్ ఐదు వికెట్లు, జోష్ టంగ్ మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల ఆధిక్యం లభించింది.
Also Read
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
- God of War: ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్'.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
- Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కొంత మెరుగ్గా ఆడినా భారీ స్కోరు చేయలేకపోయింది. ఎమిలియో గే 57 పరుగులు, జేమీ స్మిత్ 39 పరుగులతో రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఇంగ్లండ్ 226 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున నాథన్ స్మిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో కివీస్ ముందు 254 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఇక 254 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు మరోసారి షాక్‌లు తగిలాయి. ఇన్నింగ్స్ తొలి బంతికే కెప్టెన్ టామ్ లాథమ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ 18 పరుగులు చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోజు చివరి ఓవర్లో నైట్‌వాచ్‌మన్ విల్ ఓరూర్కే వికెట్‌ను గస్ అట్కిన్సన్ పడగొట్టడంతో కివీస్ 36/3 స్కోరుతో రెండో రోజు ఆట ముగించింది.
ప్రస్తుతం న్యూజిలాండ్ విజయానికి ఇంకా 218 పరుగులు అవసరం కాగా.. చేతిలో కేవలం ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. డెవాన్ కాన్వే 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పిచ్‌పై ఇంకా స్వింగ్, సీమ్ మూవ్మెంట్ కనిపిస్తుండటంతో మూడో రోజు కూడా బౌలర్లదే పైచేయిగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ జట్టు విజయానికి మరో ఏడు వికెట్లు మాత్రమే దూరంలో ఉండగా, న్యూజిలాండ్ మ్యాచ్‌లో నిలబడాలంటే రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక బ్యాటర్లు కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
-
Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
-
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
-
itel VistaTab 32: ఐటెల్ VistaTab 32 టాబ్లెట్ లాంచ్.. 8200mAh బ్యాటరీ, 11 ఇంచెస్ డిస్ప్లే, 8MP కెమెరా ఫీచర్లు ఇవే!
-
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!